గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిసారిగా 'కొండపొలం' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టుల షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన 'ఎటాక్' సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సిజ్లింగ్ క్వీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ఇంటరాక్ట్ చేయడానికి Q అండ్ A సెషన్‌ను నిర్వహించింది. ఒక ఫాలోయర్ తన ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరని రకుల్‌ను అడిగినప్పుడు, రకుల్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. ఈ సిజ్లింగ్ బ్యూటీ '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే తెలుగు సినిమాకి సైన్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa