ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని విషయాలలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ వెళుతోంది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి కొత్త రికార్డులను కొల్లగొట్టేసింది. 10 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 97 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 232.19 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 494.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 750 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేయడం విశేషం. చాలా వేగంగా .. అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' ప్రశంసలు అందుకుంటోంది. కథాకథనాలు .. చిత్రీకరణ .. పాటలు .. భారీ సెట్స్ .. కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. వసూళ్ల పరంగా ఈ సినిమా ఇంకా అదే దూకుడును కొనసాగిస్తూ ఉండటంతో, అందరూ 1000 కోట్ల మార్క్ పై దృష్టి పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa