ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు సాయంత్రం...బీస్ట్ సినిమా తెలుగు ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 09:30 PM

బీస్ సినిమా తెలుగు ట్రైలర్ తెలుగు అభిమానుల ముందుకు రాబోతోంది. తాజాగా విజయ్ నుంచి మరో భారీ బడ్జెట్ చిత్రంగా రావడానికి 'బీస్ట్' రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమాను ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు సాంగ్ వదిలారు. 'హలమితి హబీబో .. ' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీసాయి కిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుధ్ - జొనిత గాంధీ ఆలపించారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన తమిళ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు ట్రైలర్ ను వదలనున్నారు. ఇటీవల పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'రాధే శ్యామ్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, పూజ హెగ్డే ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక ఆమె చేసిన 'ఆచార్య' కూడా ఈ నెల 29వ తేదీన విడుదలవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa