చైతన్య దంతులూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భళా తందనానా' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. అయితే తాజాగా శ్రీవిష్ణు ఈరోజు మరో కొత్త చిత్రానికి సంతకం చేశాడు. 'అల్లూరి' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేసారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa