యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ బుచ్చి బాబు సానాతో 'ఎన్టీఆర్31' సినిమా చేయనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందనే అంచనాలు వినిపిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, స్క్రిప్ట్‌తో బుచ్చిబాబు సిద్ధంగా ఉన్నారని, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తిగా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కోసం పని చేయడం ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa