తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ 'ఎఫ్‌ఐఆర్' సినిమా ప్రొమోషన్స్ లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ స్టార్ హీరో ట్విట్టర్‌లో ఈరోజు సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని వెల్లడిస్తానని ప్రకటించారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ టైటిల్ ని ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ, విష్ణు విశాల్ ఇద్దరూ తమ సొంత బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు. రవితేజ అప్ కమింగ్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa