తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా "తలపతి66" అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని సమాచారం. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించడం దాదాపు ఖరారైంది. తాజాగా ఈరోజు కన్నడ బ్యూటీ రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇదే విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో స్పెషల్ సెట్‌లో ఈ సినిమా షూట్ చేయనున్నట్లు సమాచారం. 2022 దీపావళికి లేదా 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa