ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు (79) కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. షాంఘైలో జన్మించిన జిమ్మీ వాంగ్ యు తైవాన్ లో స్థిరపడ్డారు. తైపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రెండు దశాబ్దాల పాటు 70కి పైగా సినిమాల్లో నటించిన జిమ్మీ వాంగ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో తనదైన ముద్రవేశారు. ఆయన కుమార్తె లిండా వాంగ్ కూడా నటి, గాయకురాలు కావటం విశేషం. నటుడు కాక ముందు నేషనల్ రివల్యూషనరీ ఆర్మీలో పని చేసిన వాంగ్ తన సీనియర్ నటి జీన్నెట్టీ లిన్ చుయ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.