రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం షాకిచ్చింది. 'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. వర్మపై నిర్మాత నట్టికుమార్ పిటిషన్ వేయడంతో ఈ ఆదేశాలను ఇచ్చింది. వర్మ నిర్మాతకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సినిమాకు కూడా రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఒప్పందం ఉంది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో వర్మపై కేసు వేశారు. ఈ తరుణంలో వర్మ చిత్రాన్ని ఆపేందుకు కోర్డు తీర్పు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa