ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' నుండి న్యూ అప్డేట్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 10:11 PM

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మజిలీ ఫేమ్ దివ్యంశ కౌశిక్, రజీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 17వ తేదీన విడుదల కానుంది. 


 ఈ మూవీ నుండి ఇప్పటికే చాలా అప్డేట్ లు రాగా, తాజాగా మరొక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ 'బుల్బుల్ తరంగ్' అనే లిరికల్ సాంగ్ ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలిపే ఒక స్పెషల్ పోస్టర్ను నిర్మాతలు తాజాగా విడుదల చేసారు. ఈ సాంగ్ లో స్టెప్పులేస్తున్న రవి, రజీషా ల స్టిల్ తో కూడిన ఈ పోస్టర్ ఇదొక లవ్ సాంగ్ అని చెప్పకనే చెబుతుంది. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నారు. హీరో వేణు కీలక పాత్ర పోషిస్తుండగా , నాజర్, నరేష్, పవిత్రలోకేష్, తణికెళ్ళభరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa