హీరో విశాల్ తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాస్ యాక్షన్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. రమణ - నంద నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో విశాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చాలా సినిమాలు చేశాడు. అయితే ఈ సారి ఈ సినిమాలో మాత్రం ఆయన కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. అయితే ఈ కానిస్టేబుల్ కూడా మాంచి పవర్ఫుల్ అనే తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఒళ్లంతా గాయాలైనా .. లాఠీ పట్టుకుని ధైర్యంగా అక్కడే నిలబడిన ఆయన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పీటర్ హెయిన్ .. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
ఈ సినిమా షూటింగును చాలా వేగంగా పూర్తిచేసే పనుల్లో ఉన్నారట. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సునైన తెలుగు సినిమాలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టి కొన్ని సినిమాలు చేసింది. 'రాజ రాజ చోర' తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'లాఠీ' ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa