కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న "ఘని" మూవీ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, వరుణ్‌ను అతని పెళ్లి ప్లాన్ గురించి అడిగినపుడు ఈ మెగా హీరో ఈ ఏడాదిలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వరుణ్ చెప్పాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తన తదుపరి సినిమాని ప్రకటించాడు. అంతే కాకుండా, తన పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో వరుణ్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa