రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' మూవీలో కాలకేయ పాత్రను పోషించిన ప్రభాకర్, షకలక శంకర్ తో ఒక సినిమా చేస్తున్నారు. పాలిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో ఒక రాత్రి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. తర్వాత ఏం జరుగుతుందనేది అనే కాన్సెప్ట్ తో స్టోరీ వెళ్లనుంది అని చెప్పారు. సస్పెన్స్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాకర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెలాఖరున సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్‌ని గోవాలో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్, అరకులో జరుపనున్నారు అని మేకర్స్ వెల్లడించారు. చలపతిరావు, సుధ, జీవా, సౌజన్య, శైలజ, అనూష, పల్లవి, సిద్ధు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకి జాన్ సంగీతం అందిస్తున్నారు. రావుల రమేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa