ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. గతంలో కాశ్మీర్ నేలపై జరిగిన అకృత్యాలను, ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను,వారి ఊచకోతను ఇంకా జనాలకు తెలియని కాశ్మీర్ అంతర్గత విషయాలను ఈ సినిమా బహిర్గతం చేసింది.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎటువంటి స్టార్ క్యాస్ట్ లేకపోయినా, భారీ ప్రమోషన్స్ చేయకపోయినా జనాలు ఈ సినిమాకి పట్టం కట్టారు. దేశప్రధాని మోడీ జీ సైతం ఈ సినిమాను చూసి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని పిలుపునివ్వడం విశేషం.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకు హైదరాబాద్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిషేక్ కలిశారు. సుదీర్ఘంగా సాగిన వీరి భేటీ ఆంతర్యం తెలియరాలేదు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సమావేశానంతరం జనసేన అధినేతను కలవటం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ ట్వీట్ చేసారు. పవన్ తో అభిషేక్ చిత్రాన్ని నిర్మిస్తారా? అందుకే వీరిద్దరి సమావేశం జరిగిందా? హరీష్ శంకర్ అక్కడ ఎందుకున్నాడంటూ చిత్రసీమలో పలు చర్చలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa