టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణ వ్రిOద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో, ఐరా క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహాతిస్వరసాగర్ స్వరాలనందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు యువతను ఆకర్షిస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రా వర్షంలా... రా వర్షంలో వెన్నెల్లా అంటూ సాగే ఈ మెలోడియస్ పాటను రొమాంటిక్ గీతంగా చిత్రీకరించారు. నాగశౌర్య ,షెర్లీ ల రొమాన్స్, పాటను ట్యూన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ పాటను సంజన-ఆదిత్య ఆలపించారు. త్వరలోనే విడుదలకానున్న ఈ సినిమాతోనైనా నాగశౌర్య మళ్ళీ విజయాల బాట పట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa