ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ తమిళ నటుడు గోపీ ఆన్‌బోర్డ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 2023 ఏప్రిల్ లేదా జూన్‌లో విడుదల కానుంది. ఈ సినిమా 30% షూటింగ్ పూర్తయిందని, మిగిలినది రాబోయే రోజుల్లో పూర్తవుతుందని మేకర్స్ వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'KGF 2' ని ప్రమోట్ చేస్తుండగా, ప్రభాస్ సాలార్ రెండు భాగాలుగా వస్తుందా దాని గురించి క్లారిటీ ఇవ్వమని అడిగినప్పుడు ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే ఆలోచన లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ముందుగా ప్రభాస్‌తో చర్చించి అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తానని ప్రస్తుతానికి సినిమాను ఒక భాగం మాత్రమే విడుదల చేస్తామని ప్రశాంత్ వెల్లడించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa