ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరుమ్ మంజిల్ లో రవితేజ 'రావణాసుర' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 06:55 PM

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ప్రాజెక్ట్స్ మరియు బిజీ షెడ్యూల్స్ లో ఉన్న హీరోలో ఒక్కరు అని చెప్పొచ్చు. 'రామారావు ఆన్ డ్యూటీ' షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత, రవితేజ 'రావణాసుర' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున ఈ సినిమా కోసం పీవీఆర్ మాల్, ఇరమ్ మంజిల్ దగ్గర భారీ సెట్ ను మేకర్స్ వేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దశా నగర్ కథానాయికలుగా నటిస్తున్నారు. "రావణాసుర" సినిమా సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa