మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో 2005లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తమన్నా మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల కాలంలో ఆమె సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా ప్రతినాయిక పాత్రలలోనూ అలరిస్తోంది. స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది. అయితే ఈ మధ్య మాల్దీవుల్లో ఆమె సందడి చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో తమన్నా పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం విస్తృతంగా సాగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని, అయితే అది రెండేళ్ల తర్వాత జరగొచ్చని తెలిపింది. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకుంటున్నాననే వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.