తాను సినిమాల నుంచి కొంత కాలం బ్రేక్ తీసుకుంటే దానిపై కొందరు వదంతులు ప్రచారం చేశారని హీరోయిన్ నర్గీస్ ఫక్రి పేర్కొంది. రాక్‌స్టార్ సినిమాలతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆ సినిమా హిట్టైనా, కొన్ని సినిమాలు అడపాదడపా చేస్తూ కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అంతేకాకుండా కాశ్మీరీ వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో డేటింగ్‌లో ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె కాస్త లావు అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. గర్భం దాల్చావా అంటూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ పరిణామాలపై ఆమె ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తనను బాడీ షేమింగ్ చేయడంతో చాలా బాధ పడినట్లు చెప్పింది. కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంటే, కొందరు ఏవేవో ఊహించుకున్నారని, ఏకంగా గర్భం దాల్చినట్లు ప్రచారం చేశారని పేర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను సన్నగా ఉండేదాన్నని, సినిమాలకు తగ్గట్టు ఒక్కోసారి బరువు పెరగాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తనను విమర్శించే వారు ఈ విషయం తెలుసుకోవాలని పేర్కొంది. ఈమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.