రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో యాంకర్, సినీ నటి గాయత్రి భార్గవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాయత్రి భార్గవి మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మనకు ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు. నా వంతు బాధ్యతగా మొక్కలు నాటానని అన్నారు. అనంతరం తన స్నేహితులు విష్ణుప్రియ, సిద్దార్థ్, డా. అనిత ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన గాయత్రి భార్గవి.