బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. శ్రీరామ నవమిని పురస్కరించుకుని మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అమితాబచ్చన్, కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శివ టైటిల్‌తో సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తారు.
ఇంకా మరెంతో మంది స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో చిత్రం రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు..తమిళ్..మలయాళం..కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది.నేడు శ్రీరామ నవమి సందర్భంగా `బ్రహ్మస్ర్తం` తెలుగు పోస్టర్ ని లాంచ్ చేసారు. భగభగమండుతోన్న సూర్య గోళం నడుమ రణబీర్ కపూర్-అలియాభట్ మధ్య రొమాన్స్ ఆసక్తికరం. పోస్టర్ లో హీరో..హీరోయిన్ ఇద్దరికి భారీ గాయాలైనట్లు తెలుస్తోంది. మరి `శివం`లో వీరిద్దరి పోరాటం ప్రేమ కోసమా? లేదా? అంతకు మించి ఇంకేమైనా? ఉందా? అన్నది తెలియాలి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా కొత్త పోస్టర్ తో అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దీంతో సినిమాకి తెలుగు నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే `ఆర్ ఆర్ ఆర్` తో మరో 1000 కోట్ల సినిమాని ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా సక్సెస్ తో రాజమౌళి ఇమేజ్ మరింత రెట్టింపు అయింది.
ఇప్పుడా క్రేజ్ `బ్రహ్మస్త్ర` కి పనికొస్తుంది. జక్కన్న ఎంట్రీతోనే సినిమాకి బోలెడంత ప్రచారం వస్తుందని చెప్పొచ్చు. అన్ని పనులు పూర్తిచేసి థియేటర్లో సెప్టెంబర్ 9న ఇదే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa