ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ లో 'ఏజెంట్' చిత్ర షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:16 PM

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అక్కినేని అఖిల్ నుండి రానున్న కొత్త చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ యాక్షన్ ఎంటెర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్యూటుగా,హ్యాండ్సమ్ గా కనిపించే అఖిల్ ఈ సినిమాలో తన లుక్కును పూర్తి గా మార్చినట్టు తెలుస్తోంది. సురేందర్ రిక్వెస్ట్ మేరకు 8ప్యాక్ చేసి, పూర్తి రఫ్ లుక్లో యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా మేక్ ఓవర్  అయ్యాడు. ఈ సినిమాలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. 


ఇటీవలనే హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ రోడ్లపై  అఖిల్ ఇంకా మిగిలిన వారి పై యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడే  ఇంటర్వెల్ సీన్ అని ప్రచారం జరుగుతోంది.  


పోతే.. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa