ప్రశాంత్ నీల్-యష్ కలయికలో 2018లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1. విడుదలైన అన్ని చోట్లా భారీ విజయాన్ని నమోదు చేసి సంచలనం రేపింది ఈ సినిమా. ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్... అన్నీ కూడా హై రేంజులో ఉండటంతో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. గత వారం నుండి ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. యష్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ ప్రొమోషన్సులో చాలా చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్రొమోషన్సులో భాగంగా తమిళనాడులోని మల్లూర్ యష్ ఫ్యాన్స్ అసోసియేషన్ యష్ ముఖంతో రూపొందించిన కటౌట్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దీనికోసం 20700 మొజాయిక్ పుస్తకాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. 130*190 సైజుతో 25,650 స్క్వేర్ ఫీట్లలో రూపొందించబడిన యష్ కటౌట్ ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్ గా ఘనత సాధించింది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. హిందీ,తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషలలో ఏప్రిల్ 14 న విడుదలవబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అంతటా ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa