ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 03:00 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం.  కేజీఎఫ్ చిత్రంతో ఆలిండియా స్థాయిలో గుర్తింపుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందించారు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ తో తనకు సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానినైన తాను ఇప్పుడాయనతో ఓ ప్రాజెక్టు కోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ కు స్క్రిప్టు బాగా నచ్చిందని, అయితే ఆయనతో చేయబోయే సినిమా ఏ జానర్ అని మాత్రం తనను అడగొద్దంటూ అందరినీ సస్పెన్స్ లో ముంచెత్తారు. ఇప్పటికే స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ ను పది, పదిహేను పర్యాయాలు కలిసుంటానని వివరించారు. 


ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు, ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం పట్టాలెక్కనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa