బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె సడన్ సప్రైజ్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ కవితను పోస్ట్ చేసింది. ఏడో క్లాసులో తాను రాసిన కవిత ఇది. '1 AM" అనే పదాలు ఇచ్చి క్లాస్ రూంలోనే ఓ కవిత రాయమని టిచర్ చెప్పడంతో.. ఆ పదాలనే టైటిల్ గా పెట్టి మూడు పేరాల కవిత రాశానని తెలిపింది. పన్నెండేళ్ల వయసులో ఈ కవిత రాసిన దీపిక.. తర్వాత తండ్రి బాటలో నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఆ తర్వాత మోడలింగ్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 'ప్రాజెక్ట్ కె' సినిమాతో దీపిక తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేయనుంది. ఎన్టీఆర్ 31 సినిమాలో హీరోయిన్ గా ఖరారైనట్టు
తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa