'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా భారతదేశంలో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి హైప్ లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, సెలబ్రిటీల నుంచి ప్రశంసలు పొందింది. తాజాగా ఇప్పుడు, 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో ఐ యామ్ బుద్ధ ఫౌండేషన్‌తో కలిసి రెండు కథలను రూపొందించబోతున్నట్లు వెల్లడించింది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు సినిమాలని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజులలో మేకర్స్ తెలియజేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa