బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అండ్ గ్లామర్ బ్యూటీ అలియా భట్ డేటింగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రేమజంట వివాహం ఈ నెల 13వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది అని సమాచారం. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రణబీర్ కపూర్ నివాసం కృష్ణరాజ్ బంగ్లాను అలంకరించారు మరియు దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు, ఈ నెల 17న చాలా గ్రాండ్‌గా ముంబయిలోని తాజ్‌మహల్ హోటల్‌లో రిసెప్షన్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలోని ఆర్కే హౌస్‌లో ప్రత్యేక మాతా కీ చౌకీతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa