ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేజీఎఫ్ 2' మూవీకి తెలంగాణా ప్రభుత్వం గుడ్ న్యూస్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 09:07 PM

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న సినిమా టికెట్ రేట్ల వివాదాలు, ధియేటర్ల కష్టాలు, చిత్ర పరిశ్రమ సమస్యలు అందరికీ తెలిసినవే. వీటన్నిటికీ పరిష్కారంగా సినిమా టికెట్ రేట్లను ఓ మోస్తరుగా పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జి.ఓ తో చిత్ర సీమ ఊపిరి పోసుకుంది. కానీ ముందునుంచి చిత్రసీమకు ఎంతో సహాయం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం మాత్రం సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేజీఎఫ్ 2 కు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు జీ. ఓ ను కూడా జారీ చేసింది తెలంగాణా సర్కార్. మల్టిప్లెక్స్ లో అయితే రూ. 50, సాధారణ థియేటర్లలో అయితే రూ. 30 చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ రేట్లు సినిమా విడుదలైన దగ్గర నుండి నాలుగు రోజుల పాటే ఉండాలని షరతు విధించింది. 


కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం కైవసం చేసుకోవడం తో చాప్టర్ 2 పై భారీ అంచనాలు నమోదయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ను భారీ గా చేసిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa