బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆమె తల్లి కాబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త పై ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు. మరి ఈ విషయాన్ని కత్రీనా కైఫ్ అధికారికంగా ప్రకటించేదాకా నిర్ధారించలేము.ప్రస్తుతానికి అయితే.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ తమ వివాహ బంధంలో మునిగితేలుతున్నారు. మరి కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అనే విషయం పై విక్కీ కౌశల్ అయినా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa