భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా 'గాలివాన' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ ని 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, నందిని రాయ్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఒరిజినల్ సిరీస్ ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సిరీస్ యువ జంట హత్య చుట్టూ తిరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే దాని పై ఈ సిరీస్ వెళ్లనుంది. ఈ ఒరిజినల్ సిరీస్ BBC అండ్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. ఈ సిరీస్ కి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa