విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత 'కాతువాకుల రెండు కాదల్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, ఈ సినిమాలోని 'టూ టూ టూ' సాంగ్ లిరికల్ వీడియోను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ వీడియోకి ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ వీడియో సాంగ్ గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ వీడియోలో ముగ్గురు స్టార్ యాక్టర్స్ కలిసి అద్భుతమైన కాస్ట్యూమ్స్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa