దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా "“బీస్ట్”". ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే విజయ్ సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ఆ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఈ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తమిళ మీడియా ధృవీకరించింది. మొత్తానికి ఈ సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa