'అఖండ' సినిమాలో బాలకృష్ణ ను డైరెక్ట్ చేసి భారీ విజయం అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ పోతినేని తో ఒక సినిమా చేయనున్నాడు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఇటీవలనే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా బరిలోకి దిగనున్నాడు హీరో రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ను ఎంపిక చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే పుష్ప 2 మరియు పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయగలుగుతుందా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. పోతే... ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతుందని ప్రచారం జరుగుతుంది. రష్మిక తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందట. అయితే ఈ హీరోయిన్ ఎంపిక విషయంలో చిత్రబృందం ఆలస్యం చేస్తుందట. పాన్ ఇండియా మూవీ కావటంతో ఈ పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో నటించబోయే సెకండ్ హీరోయిన్ పై అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa