ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'F3' సెట్స్‌లో జాయిన్ అయ్యిన పూజాహెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 02:03 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో  కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజాహెగ్డే ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తాజా రిపోర్ట్స్ ప్రకారం, పూజాహెగ్డే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యిందని, హైదరాబాద్‌లో స్పెషల్ సాంగ్ కోసం చిత్రీకరణ ప్రారంభించిందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో పూజాహెగ్డేతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa