ఒకానొక దశలో తెలుగులో నంబర్ 1 హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ క్రమంగా తెలుగు సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. మన్మథుడు-2, కొండపొలం వంటి ప్లాఫ్ సినిమాలతో ఆమె కెరీర్ మరింత క్షీణించింది. అయితే బాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలపై ఆమె దృష్టిసారించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ సరసన హీరోయిన్‌గా లక్కీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రానుంది. అజిత్ – హెచ్ వినోద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాలోనే హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. అజిత్ – వినోద్ కుమార్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం రకుల్‌ని చిత్ర యూనిట్ సంప్రదించింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో రకుల్ సినిమా చేయడానికి అంగీకరించిందని తెలుస్తోంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించగా, జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.