తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. ట్రైలర్‌లో సుమ తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ను మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది అని చెప్పొచ్చు. ఈ చిత్రం మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa