బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్‌గా 20 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. నిన్నటితో ఈ కార్యక్రమం 20 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా, హౌజ్‌లో మూడో వారం బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్‌ని ఎంపిక చేశారు. స్టోర్ రూమ్‌లో ఉన్న ఫైలుని తీసుకొచ్చిన గీతా మాధురి కెప్టెన్ ఎంపిక ప్రక్రియకి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఎవరైతే ఎక్కువ బిర్యానీ తినగులుగుతారో వారే ఈ వారం హౌజ్ కెప్టెన్‌గా కొనసాగుతారని బిగ్ బాస్ చెప్పినట్టు గీతా వెల్లడించింది. అంతకముందు ఇంటిలో అత్యంత తిండిబోతులు ఎవరని బిగ్ బాస్ అమిత్‌ని ప్రశ్నించగా, ఆయన కిరీటీ,గణేష్, రోల్ రైడా పేర్లు చెప్పాడు. దీంతో వీరి ముగ్గురిని కెప్టెన్ పోటీదారులుగా నియమించారు. సంచాలకుడిగా అమిత్ ఉన్నారు.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో పాల్గొన్న కిరీటీ, గణేష్, రోల్ రైడాలకి సంచాలకుడిగా ఉన్న అమిత్ బిర్యానీ వడ్డించాడు. ఈ పోటీలో కాల పరిమితి లేకపోవడంతో మొదట ముగ్గురు తీరికగా తినుకుంటూ కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత కిరిటీ కాస్త వెనుకడగు వేయడం, గణేష్ ఎక్కువ తినకపోవడం, రోల్ రైడా వీరిద్దరి కన్నా ఎక్కువ లాగించేయడంతో సంచాలకుడిగా ఉన్న అమిత్ .. రోల్ రైడాని ఇంటి కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. దీంతో ప్రస్తుతం ఇంటి కెప్టెన్‌గా రోల్ రైడా కొనసాగుతున్నాడు.
ఇక ఈ ప్రక్రియకి ముందు లగ్జరీ టాస్క్‌లో భాగంగా చెరకు రసం ఫ్యాక్టరీ గేమ్ బాగా ఆడినందుకు బిగ్ బాస్ ఒక్కొక్కరికి 200 పాయింట్ల చొప్పున మొత్తం 3000 పాయింట్లు ఇచ్చారు. ఈ పాయింట్స్‌తో ఇంటి సభ్యులు తమకి కావలసిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం స్టోర్ రూమ్‌లో ఉన్న వైట్ బోర్డ్‌ని తీసుకొచ్చి దానిపై డిస్ ప్లేలో కనిపిస్తున్న సరుకుల పేర్లు తెలుగులో రాయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ క్రమంలో వారికి కావలసిన సరుకులని, పక్కన పాయింట్ల సంఖ్యని వైట్ బోర్డుపై భాను శ్రీ రాసారు.
బ్రౌన్ బ్రెడ్ (700 పాయింట్లు), అటుకులు కేజీ (160), బేసన్ రెండు ప్యాకెట్లు (160), కాపీ రెండు (350), నెయ్యి ఒకటి (80), తెనే ఒకటి (80), చెనా ఒకటి (80), సేమియా రెండు (200), దోస మూడు (240), టమాటో పచ్చడి మూడు (450), ఆవకాయ ఒకటి (150), మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్ ఒకటి (100), జీడిపప్పు ఒకటి (250).. ఇలా 3000 పాయింట్లకు సరిపడా సరుకుల పేర్లు రాశారు. అయితే కాఫీ పేరును మాత్రం ఇంగ్లిష్‌లో రాయడంతో , ఇది రాకపోవచ్చని కిరీటి రెండు మూడు సార్లు చెబుతూ , బజర్ మోగిన తరవాత మళ్లీ ఆ బోర్డును స్టోర్ రూమ్‌లో పెట్టేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa