ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం OTTలో ప్రసారానికి అందుబాటులోకి రానున్న కొత్త టైటిల్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:57 AM

ఘని: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన "ఘని" మూవీ ఏప్రిల్ 8, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది మరియు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది. ఏప్రిల్ 22, 2022న OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


ఓహ్ మై డాగ్: సరోవ్ షణ్ముగం దర్శకత్వంలో స్టార్ హీరో అరుణ్ విజయ్ అండ్ అతని కుమారుడు అర్నవ్ విజయ్ 'ఓహ్ మై డాగ్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 21, 2022న ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ విజయ్‌కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల కానుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa