బాలీవుడ్ భామ తారా సుతారియా మంచి సింగర్,డాన్సర్ కూడా. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. మార్గావాన్, తడప్ సినిమాల్లో నటించింది. మంచి నటి అనిపించుకుంది. గ్లామర్ హీరోయిన్ కు సరిపోయే సరుకు ఈ అమ్మడు సొంతం. ఆ అందాలను తరచూ కెమెరా ముందు ఆరబోసే అలవాటు కూడా ఉంది. తాజాగా లెహంగా లో మెరిసింది. ఎప్పటి లాగే హాట్ కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటిస్తోంది. హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తుంది. ఇందులో హీరోపంతి 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 29 హీరోపంతి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జులై 8న 'ఏక్ విలన్ రిటర్న్స్' రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa