కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ది వారియర్. కెరీర్లో మొదటిసారిగా రామ్ పోలీసాఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ సరసన కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. DSP సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
పోతే.. తాజాగా ఈ మూవీ నుండి బుల్లెట్ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయటానికి టైం ఫిక్స్ చేసారు చిత్రబృందం. ఏప్రిల్ 22న సాయంత్రం 5. 45నిముషాలకు బుల్లెట్ సాంగ్ లిరికల్ వెర్షన్ రిలీజ్ అవనుంది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదలైంది. హై ఓల్టేజ్ మాస్ స్టెప్పులతో ఈ పాట అదిరిపోనుందని పోస్టర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa