ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబులో దూసుకుపోతున్న మెగా ట్రీట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 02:31 PM

టాలీవుడ్ సక్సెస్ మెషిన్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. చిరు కెరీర్లో 153వ చిత్రం ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ చేస్తూ ఈ సినిమాకు మరింత హైప్ ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్  నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23 న అత్యంత భారీగా జరగబోతున్నట్టు తెలుస్తోంది.


పోతే... తాజాగా ఈ మూవీ నుండి నిన్న విడుదలైన భలే భలే బంజారా పాట మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్  చేస్తుంది. ఇంకా 24 గంటలు గడవకముందే 6 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబులో #1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇందులో చిరు, చరణ్ ల క్లాస్సి మూవ్మెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ లు ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట పూర్తి వీడియోను చూడాలని అభిమానులు కుతూహలపడుతున్నారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa