ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ 1 గా ఆచార్యలోని 'భలే భలే బంజారా' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 06:48 PM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. ఈ మూవీని పెన్ స్టూడియోస్ హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భలే భలే బంజారా' సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ పాటను మణిశర్మ కంపోస్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో తండ్రీ కొడుకులు చేసిన స్టైలైజ్‌ డాన్స్ స్టెప్పులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, 'భలే భలే బంజారా' పాట 6 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రో కంపెనీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసి ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa