'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైన తర్వాత షాలినీ పాండే టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో బబ్లీ బ్యూటీ ఫుల్ ఫేమస్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం ఆఫర్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఇప్పుడు, ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా ఛాన్స్ కొట్టేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా కోసం షాలిని పాండేని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa