టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రానున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తోంది. ఈరోజు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారి పుట్టినరోజు సందర్భంగా, ఈ స్టార్ హీరో సోషల్ మీడియా లో తన తల్లి కి విష్ చేస్తూ ఒక ఫోటోని షేర్ చేసాడు. 'హ్యాపీ బర్త్ డే అమ్మ. ఒక రోజు నిజంగా సరిపోదు! ఎప్పటికి నిను ప్రేమిస్తాను' అంటూ ఈ ఫోటోకి కాప్షన్ ఇచ్చాడు. సూపర్ స్టార్ అభిమానులు కూడా మహేష్ తల్లికి కామెంట్స్ లో తమ విషెస్ తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa