"అందాల రాక్షసి" మూవీ నుంచి 'ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు' సాంగ్ లిరిక్స్:
శపించనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇక పై నా జీవితం.
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం...
ఏ...మిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
విం..తగా ఆకాశమంచు తాకుతున్న
గుండె..నే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినం..తనే
మనసు నవ్వే మొదటిసారి
ఏం మార్పిదీ.. ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
ఆగనీ.. ప్రయాణమై యుగాలుగా సాగిన
ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే!
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా?
నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ…
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa