ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'1996 ధర్మపురి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి డేట్ అండ్ టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 12:18 PM

జగత్ దర్శకత్వంలో గగన్ విహారి నటిస్తున్న '1996 ధర్మపురి' సినిమా ఏప్రిల్ 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలో గగన్ విహారి సరసన అపర్ణా దేవి జంటగా నటిస్తుంది. నిజామాబాద్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా  '1996 ధర్మపురి' సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ మహేష్, జనార్ధన్, కేశవ, నారాయణ స్వామి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. 1996 ధర్మపురి మూవీ మేకర్స్ ఈరోజు హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ రియలిస్టిక్ ఫీచర్ మూవీని భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా కింద భాస్కర్ యాదవ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ వీజే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa