వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్" మార్చి 11న థియేటర్‌లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28, 2022న ఇజ్రాయెల్‌లో విడుదల చేయనున్నట్టు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. TKF పోస్టర్‌ని ఆవిష్కరించడానికి మా స్టూడియోకి వచ్చినందుకు కాన్సుల్ జనరల్ కొబ్బి శోషానికి ధన్యవాదాలు అంటూ కాప్షన్ కూడా ఇచ్చారు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లలకి పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa