అంటే .. సుందరానికీ' సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అని హీరో నాని పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా కథానాయికగా పరిచయమవుతోంది. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "అంటే .. సుందరానికీ' సినిమా నాకు చాలా చాలా స్పెషల్ సినిమా. ఎందుకు అనేది .. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా .. అప్పుడు చెబుతాను. ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మేమంతా కలిసి ఈ సినిమాకి పనిచేశాము. ఈ సినిమాను వివేక్ తప్ప ఇంకా ఎవరూ తీయలేరు. ఈ కథను ఆయన చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు.
నా సినిమా అనే కాదు ఇకపై వివేక్ ఏ సినిమా తీసినా ఫస్టు డేనే మార్నింగ్ షో చూస్తాను. నజ్రియాతో తెలుగు సినిమా చేయించాలని ఇంతకుముందు చాలామంది ప్రయత్నించారుగానీ కుదరలేదు. ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించడం విశేషం. టీజర్ కి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది .. దానికి పది రెట్లు సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa