ఎన్ని సంవత్సరాలు దాటినా మూడుమూళ్ల బంధం ముందు ఏదీ సాటిరాదు అటా. సూపర్ స్టార్ కృష్ణ అర్ధాంగి ఇందిరాదేవి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు వేడుక నిర్వహించారు. ఈ సంబరాల్లో కృష్ణ కూడా పాల్గొన్నారు. భార్య ఇందిరకు ఆప్యాయంగా కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఇందిరాదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుమార్తె మంజుల, గల్లా జయదేవ్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్, కుమార్తె సితార తదితరులు పాల్గొన్నారు. ఈ పుట్టినరోజు వేడుక ఫొటోలను మంజుల సోషల్ మీడియాలో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa