ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికీ పేకప్ చెప్పాకే...చిరంజీవి గారు వెళ్లేవారు కాదు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 01:52 AM

ఇంటికంటే ఎక్కువగా సినిమా షుటింగ్ సెట్ నే మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడతారని దర్శకుడు కొరటాల అన్నారు. కొరటాల దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ అనే మాటనే వినలేదు. ఒకదానికి మించిన హిట్ మరొకటి ఇస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. ఆయన తాజా చిత్రమైన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా మొదలైన ప్రమోషన్స్ లో కొరటాల కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.


"చిరంజీవిగారికి సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, ఆయనకి సాయంకాలం 4.40కి పేకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ గం. 6.40కి పంపించేవాడిని. కానీ చిరంజీవిగారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరికీ పేకప్ చెప్పిన తరువాతనే ఆయన వెళ్లేవారు.


సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం .. లైట్స్ .. సౌండ్ ..  యాక్షన్ .. కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టం. సెట్ కి ఎవరైనా వస్తానంటే వాళ్ల కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేసేవారు. వాళ్లతో సరదాగా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa